Sunday, 08 September 2024 07:44:19 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

నాని మూవీ సాంగ్ చూసి ఎమోషనల్ అయిన మహేష్ బాబు ..

Date : 07 October 2023 03:08 PM Views : 87

జై భీమ్ టీవీ - సినిమా / : నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హయ్ నాన్న. నాని రీసెంట్ గా దసరా సినిమాతో హిట్ అందుకున్నాడు. నాని ఊర మాస్ లుక్ లోకి మారి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటించింది. దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న అంటూ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మృణాల్ కు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు నాని తో కలిసి సినిమా చేస్తోంది. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తండ్రి కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల మందికి రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి గాజు బొమ్మ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ అందమైన సాంగ్ తండ్రి కూతురికి మధ్య సాగే పాట. ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈసాంగ్ పై మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా లో ఈసాంగ్ లింక్ ను షేర్ చేస్తూ.. చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. ‘ఒక తండ్రి నుంచి అతని కుమార్తె వరకు.. ప్రతి తండ్రి మదిలో ప్రతి ధ్వనించే పాట ఇది. హాయ్ నాన్న చిత్రబృందానికి నా ఆల్‌ ది బెస్ట్ అంటూ మహేష్ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. హాయ్ నాన్న సినిమాకు అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :