Sunday, 08 September 2024 07:38:53 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

రణ్వీర్, దీపికా పదుకొణె ఆస్తి విలువ ఎంత ఉంటుందో తెలుసా ?.. సీక్రెట్స్ పంచుకున్న స్టార్ కపుల్..

Date : 27 October 2023 11:07 AM Views : 98

జై భీమ్ టీవీ - సినిమా / : బాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్స్‏లో దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ జంట ఒకటి. చాలాకాలంపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2018లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఇద్దరూ తమ కెరీర్ లో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల వీరిద్దరూ కలిసి కాఫీ విత్ కరణ్ సీజన్ 8 మొదటి ఎపిసోడ్ కు అతిథులుగా విచ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గతంలో ఇద్దరూ విడివిడిగా ఈ షోకు వెళ్లారు. కానీ ఇద్దరూ కలిసి వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత తమ పెళ్లి వీడియోను రిలీజ్ చేశారు దీపికా, రణవీర్. ఆ తర్వాత తమ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రణవీర్, దీపికా కలిసి అనేక చిత్రాల్లో నటించారు. వీరిద్దరి కాంబోలో రామ్-లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, సింబా, గల్లీ బాయ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చాయి. రామ్ లీలా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని గతంలో అనేకసార్లు చెప్పుకొచ్చారు రణవీర్. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక నివేదికల ప్రకారం .. రణవీర్ సింగ్ ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 362 కోట్లుగా అంచనా. నటుడు ప్రతి చిత్రానికి దాదాపు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సంవత్సరానికి రూ. 21 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. 2019లో, అతను ఫోర్బ్స్ భారతదేశంలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో ఏడవ స్థానంలో నిలిచాడు. 2012 నుండి ఈ ఎలైట్ ర్యాంకింగ్‌లో తన ఉనికిని కొనసాగించాడు. ఇదిలా ఉంటే.. 2007లో ‘ఓం శాంతి ఓం’తో బాలీవుడ్‌లో దీపికా పదుకొణె ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఆమె పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా ఎదిగింది. ముఖ్యంగా, సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ కోసం ఆమె రూ. 13 కోట్ల పారితోషికం తీసుకుంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. 82°E పేరుతో చర్మ సంరక్షణ బ్రాండ్ ప్రారంభించింది. అలాగే నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి పలు చిత్రాలు నిర్మించింది. అలాగే అనేక వ్యాపారాల్లో రాణిస్తుంది. దీపికా నికర విలువ రూ. 497 కోట్లు. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్‌లు కలిసి నికర విలువ దాదాపు రూ. 860 కోట్లు! ఉన్నట్లు తెలుస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :