Sunday, 08 September 2024 07:45:40 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

‘టైటానిక్‌’లో జాక్‌-రోజ్‌ ధరించిన దుస్తులకు వేలంపాట.. కోట్ల రూపాయల్లో అమ్మకాలు

Date : 10 October 2023 09:47 AM Views : 111

జై భీమ్ టీవీ - సినిమా / : జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన 'టైటానిక్' ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ మైలురాయి. అందమైన ప్రేమ కథ సినీ ప్రియులను ఎంతగానో ఆకర్షించింది. ఇక టైటానిక్‌లో జాక్-రోజ్‌ల విషాదాంత ప్రేమ కథ సినీ అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ మువీ డిసెంబర్ 19, 1997న విడుదలవ్వగా అప్పటా కాలంలోనే బాక్స్‌ ఆఫీస్‌ను షేక్‌ చేసింది. 'టైటానిక్' చిత్రంలో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ హీరోహీరోయిన్లుగా నటించారు. 1997లో విడుదలైన జేమ్స్ కెమెరూన్ అద్భుత సృష్టి టైటానిక్ మువీలో రోజ్-జాక్ పాత్రల్లో వీరు జీవించేశారు. తాజాగా ఈ చిత్రంలో జాక్ (లియోనార్డో డికాప్రియో) ధరించిన దుస్తులు వేలానికి వచ్చాయి. డికాప్రియో ధరించిన బట్టలు కోట్ల రూపాయల ధర పలకనున్నట్లు సమాచారం. టైటానిక్‌లో డికాప్రియో ధరించిన సస్పెండర్‌లతో కూడిన కార్డ్‌రోయ్ ప్యాంటు, కాలర్‌లెస్ వైట్ షర్ట్, చొక్కా వేలానికి ఉంచారు. కేవలం డికాప్రియో దుస్తులకే దాదాపు రూ.2 కోట్లు రానున్నట్లు అంచనా. ఈ వేలం నవంబర్ 9 నుంచి 12 వరకు లండన్‌లో జరగనుంది. అలాగే టైటానిక్‌ సినిమా హీరోయిన్ కేట్ ధరించిన డ్రెస్ కూడా వేలానికి వచ్చింది. డికాప్రియో ధరించిన ఓవర్ కోట్‌ను వేలానికి పెట్టారు. ఈ దుస్తులను సెప్టెంబర్ 13న ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నారు. టైటానిక్‌లో వాడిన కస్ట్యూమ్‌తోపాటు పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్‌లో యాక్షన్ సన్నివేశాల సమయంలో జానీ డెప్ ధరించిన దుస్తులు, స్టార్ వార్స్‌లో కొన్ని ప్రత్యేక దుస్తులు, ఫారెస్ట్ గంప్‌లో టామ్ హాంక్స్ ధరించిన స్నీకర్స్ వంటి అనేక వస్తువులు ఈ వేలంలో అమ్మనున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :