Sunday, 08 September 2024 07:42:06 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఓటీటీలోకి లేటెస్ట్‌ సూపర్‌ హిట్‌ మూవీ.. మ్యాడ్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

Date : 27 October 2023 11:09 AM Views : 118

జై భీమ్ టీవీ - సినిమా / : ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన మూవీస్‌లో మ్యాడ్‌ ఒకటి. ఇంజినీరింగ్‌ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. అన్ని చోట్లా పాజిట్‌ టాక్‌, రివ్యూలు వచ్చాయి. దీతో మ్యాడ్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ మ్యాడ్‌ సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అతనితో పాటు సంతోష్‌ శోభన్‌ తమ్ముడు సంగీత్‌ శోభన్‌ ఇందులో కీలక పాత్ర పోషించాడు. తన కామెడీతో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు. వీరితో పాటు మూడో హీరోగా రామ్‌ నితిన్‌ కూడా జనాలను అలరించాడు. అక్టోబర్‌ 6న థియేటర్లలో విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన మ్యాడ్ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నవంబర్‌ మొదటి వారంలో మ్యాడ్‌ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మ్యాడ్ సినిమాకు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘు బాబు, రచ్చ రవి, మురళీధర్‌ గౌడ్‌, విష్ణు, ఆటోని, శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ప్రముఖ దర్శకుడు కేవీ అనుదీప్‌ ఈ మూవీలో ఓ క్యామియో రోల్‌లో మెరవడం విశేషం. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సాయి సౌజన్య, హారిక సూర్యదేవర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భీమ్స్‌ సిసిరిలియో అందించిన పాటలు చార్ట్‌ బస్టర్‌గా నిలిచాయి. ఇక మ్యాడ్‌ కథేంటంటే.. ఈ సినిమా మొత్తం ఇంజినీరింగ్‌ కాలేజీ చుట్టే తిరుగుతోంది. మ‌నోజ్ (రామ్ నితిన్‌), అశోక్ (నార్నే నితిన్‌), దామోద‌ర్ అలియాస్ డీడీ (సంగీత్‌ శోభ‌న్‌) ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చేరతారు. వారి జీవితాల్లోకి జెన్నీ(అనంతిక‌), శృతి (శ్రీగౌరిప్రియారెడ్డి), , రాధ (గోపిక ఉద్యాన్‌) వస్తారు. మరి ఈ ముగ్గురి వ‌ల్ల అశోక్‌, మ‌నోజ్‌, డీడీ జీవితాలు ఎలా మారిపోయాయి? అన్నది ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు డైరెక్టర్‌. థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వుకున్నారు. మరి మీరు ఈ సినిమాను మిస్‌ అయ్యారా? లేక మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఓటీటీ రిలీజ్‌ కోసం వెయిట్‌ చేయండి. మ్యాడ్ సినిమా ట్రైలర్..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :