Sunday, 08 September 2024 07:47:40 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

నాగచైతన్య, సమంత, ఓ కుక్క పిల్ల.. ఇంతకీ ఈ జంట మధ్య ఏం జరుగుతోందబ్బా.?

Date : 10 October 2023 09:45 AM Views : 93

జై భీమ్ టీవీ - సినిమా / : సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎప్పుడు, ఏ అంశం, ఎందుకు చర్చనీయాంశంగా మారుతుందో తెలియడం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు నిత్యం ట్రెండింగ్‌లో ఉంటాయి. ఒక చిన్న ఫొటో వెయ్యి వార్తలకు కారణంగా మారుతుంది. తాజాగా నాగ చైతన్య, సమంతలకు సంబంధించిన ఓ అంశం ఇలాంటి చర్చకే దారి తీసింది. ఇంతకీ అసలు కథెంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. సమంత, నాగచైతన్య విడాకులతో వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన తర్వాత కూడా నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. గతకొన్ని రోజుల నుంచి ఈ జంట మళ్లీ కలవబోతున్నారంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్య పోస్ట్ చేసిన ఓఫొటో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది. సమంత, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు హాష్‌ అనే పెంపుడు కుక్కను పెంచుకున్న విషయం తెలిసిందే. నిత్యం ఈ కుక్కతో కలిసి దిగిన ఫొటోలను ఈ జంట సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేది. అయితే వీరిద్దరు విడిపోయిన తర్వాత నుంచి హాష్ సమంతతో ఉంది. గతంలో కొన్నిసార్లు సామ్‌ ఈ కుక్క ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కుక్కపిల్ల నాగచైతన్యతో కనిపించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ అభిమాని కొత్త బైక్ కొనుక్కొని నాగచైతన్య కలవడానికి వెళ్లగా అక్కడ ఓ కుక్కపిల్ల చైతన్య వద్దకు వచ్చింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాజాగా మరోసారి అదే కుక్క పిల్ల ఫొటోను చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కారులో తీసిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన చై, సామ్‌ ఫ్యాన్స్‌ ఈ జంట కలిసిపోయిందంటూ కామెంట్స్‌ చేసేస్తున్నారు. అయితే దీనిపై మాత్రం చై కానీ సామ్‌ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ మరో చర్చకు దారి తీసింది. సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ‘దయాగుణాన్ని వ్యూహంగా కాకుండా.. జీవిత మార్గంగా అలవరుచుకునే వారికి హ్యాట్సాఫ్‌’ అనే కొటేషన్‌ రాసున్న ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో సమంత చేసిన పోస్ట్ వెనకాల అసలు కారణం ఏంటి.? చైతన్య, సమంత మళ్లీ కలిసిపోనున్నారని వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టడానికే ఇలాంటి పోస్ట్ చేసిందా.? అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా అటు చై, ఇటు సామ్‌ చేస్తున్న ఈ పోస్టులు నెటిజన్లను కన్ఫ్యూజ్‌కు గురి చేస్తాయని చెప్పాలి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :