Sunday, 08 September 2024 07:28:25 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

అపార్ధం చేసుకోవద్దు.. అమర్ దీప్ గురించి అతని భార్య ఏం చెప్పిందంటే..

Date : 14 October 2023 01:22 PM Views : 99

జై భీమ్ టీవీ - సినిమా / : బిగ్ బాస్ సీజన్ 7 లో సీరియల్ బ్యాచ్ లో సందడి ఎక్కువైంది. హౌస్ లోకి వచ్చిన సీరియల్ బ్యాచ్ లో అమర్ దీప్ ఒకరు. అమర్ దీప్ గౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి గేమ్ ఆడలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. తన స్ట్రాటజీతో గేమ్ ఆడాలన్నా హౌస్ లో ఉన్నవారు తనను ఆడనివ్వడం లేదు అని అమర్ దీప్ చాలా సందర్భాల్లో బాధపడ్డాడు. ఇక అమర్ దీప్ పై ఇప్పటికే నెగిటివిటి ఎక్కువైంది. అతను గేమ్ సరిగ్గా ఆడటం లేదని చూస్తున్న ప్రేక్షకులు భావిస్తున్నారు. నాగార్జున కూడా ఇప్పటికే అమర్ దీప్ కు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు. గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటానని అమర్ కూడా ప్రతివారం చెప్పుకుంటూ వస్తున్నాడు. మొదట్లో శివాజీ ప్రశాంత్ కు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడని పవర్ అస్త్ర దక్కించుకున్న శివాజి తనకు అన్యాయం చేశాడని హౌస్ లో గొడవ పడటమే కాదు నాగ్ ముందు కూడా అదే చెప్పాడు. ఇక అమర్ దీప్ ప్రతివారం నామినేట్ అవుతున్నాడు. ఏదోరకంగా ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతున్నాడు అమర్ దీప్. ఇక ఇప్పుడు ఇప్పుడే అమర్ దీప్ గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. బిగ్ బాస్ మాజీ బ్యూటీ అరియానా కూడా అమర్ దీప్ ను సపోర్ట్ చేసింది. మనోడికి టైం కలిసి రావడం లేదు అని.. టైం కలిసొస్తే అమర్ సత్తా చాటుతాడు అని చెప్పుకొచ్చింది అరియానా. తాజాగా అమర్ దీప్ భార్య తేజస్విని అమర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తేజస్విని మాట్లాడుతూ.. అమర్ దీప్‌ ది చిన్నపిల్లాడి మనస్తత్వం.. చిన్న పిల్లలు ఎలా చేస్తారో అం,అమర్ కూడా అలాగే చేస్తాడు. ఒక్కొక్కసారి మాట వింటాడు.. ఒకొక్కసారి మాట వినడు. చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడం వస్తే.. అమర్‌ని హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పుకొచ్చింది. అమర్ ను అర్ధం చేసుకోవాలి.. అపార్ధం చేసుకోకూడదు అంటుంది తేజస్విని. బిగ్ బాస్ హౌస్ లో మైండ్ గేమ్ ఆడవాళ్లు ఎక్కువగా ఉంటారు. మన ముందు బాగానే ఉంటారు. కానీ మన వెనక గేమ్ ఆడుతారు. అమర్ అది అర్ధం చేసుకోలేకపోతున్నాడు అంటుంది తేజస్విని. అమర్ దీప్.. ఏది చెప్పినా నమ్మేస్తాడు. ఎదుటివారు తనను అర్ధం చేసుకుంటారా లేదా అని భయపడతాడు. టాస్క్‌లలో కష్టపడతాడు.. విన్ అవ్వాలని ఆడతాడు.కానీ మైండ్ గేమ్ రాదు. డిఫరెంట్ మైండ్ సెట్స్‌ని హ్యాండిల్ చేయడం కష్టమే. మనుషుల్ని హ్యాండిల్ చేయడం తనకు రాదు అంటూ చెప్పుకొచ్చింది తేజస్విని. ఇక ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉన్నాడు అమర్.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :